- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CAREER NEWS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి సంస్థ. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) సంయుక్తంగా విశాఖపట్నంలో భారీ కెరీర్ ఫెయిర్(CAREER FAIR)ను నిర్వహిస్తున్నాయి. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా 49 అగ్రశ్రేణి ఐటీ, సంబంధిత కంపెనీల్లో 10,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి సంస్థ. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) సంయుక్తంగా విశాఖపట్నంలో భారీ కెరీర్ ఫెయిర్(CAREER FAIR)ను నిర్వహిస్తున్నాయి. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా 49 అగ్రశ్రేణి ఐటీ, సంబంధిత కంపెనీల్లో 10,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ భారీ కెరీర్ ఫెయిర్ విశాఖపట్నం, గీతం విశ్వవిద్యాలయం వేదికగా జరగనుంది.
మార్చి 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నారు. 2004, 2025 పాస్ అవుట్ అయిన టెక్, ఆర్ట్స్, సైన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ , డిప్లమా ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు మార్చి 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.కెరీర్ ఫెయిర్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు మార్చి 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు , ఇతర సంబంధిత సమాచారాన్ని ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా పూర్తి చేయవచ్చు.
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి : నారా లోకేష్
కెరీర్ ఫెయిర్ కు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నిరుద్యోగ యువతకు ఇదొక సువర్ణావకాశమని.. ఈ కెరీర్ ఫెయిర్ సద్వినియోగం చేసుకుని యువత తమ కలల కొలువును సొంతం చేసుకోవచ్చన్నారు. 49 అగ్రశ్రేణి కంపెనీలు ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయని. కాబట్టి, అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు.






