- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News : తెలంగాణ (EAPCET) ఎప్ సెట్ పోటీ పరీక్షల కోసం టీ -సాట్ డిజిటల్ కంటెంట్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎప్ సెట్ 2026-27 పోటీ పరీక్షల కోసం టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ జనవరి 12వ తేదీ నుంచి ప్రసారమౌతోందని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎప్ సెట్ 2026-27 పోటీ పరీక్షల కోసం టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ జనవరి 12వ తేదీ నుంచి ప్రసారమౌతోందని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ మేరకు శనివారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యను ఎంచుకునే విద్యార్థుల కోసం టీ-సాట్ నెట్వర్క్ నాణ్యత కలిగిన డిజిటల్ కంటెంట్ అందిస్తోందని, వచ్చే విద్యా సంవత్సరంలో ఆయా కోర్సులు ఎంచుకునే విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు డిజిటల్ కంటెంట్ తోడ్పడుతుందని పేర్కొన్నారు.
పేద, మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం టీ-సాట్ వేదికగా కంటెంట్ అందిస్తూ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత సేవలందిస్తోంది, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఎప్ సెట్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు జనవరి 12వ తేదీ సోమవారం నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించి.. 112 రోజుల పాటు 450 పాఠ్యాంశ భాగాలను టీ-సాట్ విద్య ఛానల్ లో ఉదయం ఏడు గంటలకు, నిపుణ ఛానల్ లో సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం చేయనున్నామని సీఈవో తెలిపారు. ప్రసారాలు టీ-సాట్ శాటిలైట్ ఛానళ్లతో పాటు యాప్, యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంటాయని, విద్యార్థినీ, విద్యార్థులు డిజిటల్ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు.





