నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.లక్షకు పైగా జీతం పొందే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Yella Dhawani Reddy |

నిరుద్యోగ అభ్యర్థులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.లక్షకు పైగా జీతం పొందే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగ అభ్యర్థులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన ఈ సంస్థలోని వివిధ విభాగాల్లో ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

మొత్తం పోస్టులు: 28

అర్హతలు: ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ పూర్తిచేయాలి. ఉద్యోగానుభవం, ఐటీ ప్రాజెక్టులు/ ఐపీ నెట్‌వర్కింగ్, మెయింటెనన్స్, ప్రొడక్ట్‌ సపోర్ట్‌ సర్వీసుల్లో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు.

వయసు: 1.05.2025 నాటికి 35 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.40,000- రూ.55,000.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 4వ తేదీ జూన్ 2025

వెబ్‌సైట్‌: https://bel-india.in/job-notifications

నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

Next Story