Bank Jobs: డిగ్రీ అర్హతతో సూపర్ ఛాన్స్.. నెలకు రూ.48 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించవచ్చు

by Yella Dhawani Reddy |

నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది.

Bank Jobs: డిగ్రీ అర్హతతో సూపర్ ఛాన్స్.. నెలకు రూ.48 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించవచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పోస్టులు: సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్, ఆఫీస్‌-డెవలపర్, సీనియర్‌ మేనేజర్, ఆఫీసర్‌-క్లౌడ్‌ ఇంజినీర్, ఆఫీసర్‌-ఏఐ ఇంజినీర్, మేనేజర్‌-ఏఐ ఇంజినీర్, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్, మేనేజర్‌ ఏపీఐ డెవలపర్, మేనేజర్‌- నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, సీనియర్‌ మేనేజర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి

మొత్తం ఖాళీలు: 518

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టు ప్రకారం 22 ఏళ్ల నుంచి 43 ఏళ్లు ఉండాలి.

వేతనం: పోస్టును బట్టి నెలకు పోస్ట్‌ గ్రేడ్- జేఎంజీ/ఎస్‌-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్‌-2కు రూ.64,820, ఎంఎంజీ/ఎస్‌-3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు రూ.1,02,300 వేతనం ఉంటుంది.

ఎంపిక: పరీక్ష/ఇంటర్వ్యూలతో

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.100.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 11, 2025

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/career

Next Story