ఏపీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ కొత్త పరీక్ష తేదీలు

by Ajay Maddhiboyina |

మెగా డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ రాస్తున్న కొందరు అభ్యర్థులు

ఏపీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ కొత్త పరీక్ష తేదీలు
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ రాస్తున్న కొందరు అభ్యర్థులు ఈ పరీక్షలు కూడా రాస్తుండటంతో ఏపీపీఎస్సీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ లెక్చరర్ నియామక పరీక్షలకు సంబంధించి కొత్త పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పరీక్షలను జూలై 15, 2025 నుండి 23 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇక గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జూన్‌లోనే నిర్వహించాల్సి ఉంది.

Next Story