దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

by Bhoopathi Nagaiah |

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుండి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు.

దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుండి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ శాఖలలో వివిధ కేటగిరిలకు రిజర్వు చేసిన 38 బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతులు ఈ నెల 25వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు18 సంవత్సరాలు పైబడి ఉండాలని 2026 జూలై 1వ తేదీ నాటికి 52 సంవత్సరాలు నిండి ఉండరాదన్నారు. ఈ బ్యాక్ లాగ్ ఉద్యోగాల సూచనలు, దరఖాస్తు నమూనా ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ https://gunturap.in/dw2026 వెబ్ సైట్లో చూడవచ్చని తెలిపారు. వివరాలకు 0863 2323329 ఫోన్ నంబరుకు సంప్రదించవచ్చని చెప్పారు.

Next Story