ICFలో 782 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web Desk 21 |
ICFలో 782 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2023 - 24 ఏడాదికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపుతారు.

అర్హత: ట్రేడులను అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటిఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభతేదీ: మే 31, 2023.

చివరితేదీ: జూన్ 30, 2023.

వెబ్‌సైట్: https://pb.icf.gov.in


Next Story

Most Viewed