RIMS అదిలాబాద్ లో 70 ఉద్యోగాలు.. భారీగా వేతనం..

by Gugulothu.Kavitha |   (  Updated:2022-03-31 06:08:46  IST  )

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS)లో70 jobs in RIMS Adilabad

RIMS అదిలాబాద్ లో 70 ఉద్యోగాలు.. భారీగా వేతనం..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 70

*ఇంటర్వ్యూ తేది: 2022 ఏప్రిల్ 11

*ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ 60, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, అబెస్టెట్రిక్స్ గైనకాలజీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి సంబంధించి ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ పాసై ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,25,000 వేతనం చెల్లించాలి.

*సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగానికి సంబంధించి ఎంబీబీఎస్ తో పాటు తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజస్టరై ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.52,000 వేతనం చెల్లించాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

*ఇంటర్వ్యూ వేదిక: Rims Medical College, Adilabad, Telangana.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం http://rimsadilabad.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story