- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. BSNLలో 120 మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాలు: పూర్తి వివరాలివే!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. మేనేజ్‌మెంట్ స్థాయిలో కీలకమైన 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 120 పోస్టులలో టెలికాం స్ట్రీమ్ 95 పోస్టులు, ఫైనాన్స్ స్ట్రీమ్ 25 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు & వయోపరిమితి..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో B.E./B.Tech పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,900 నుంచి రూ. 50,500 (పాత స్కేల్ ప్రకారం) వేతన శ్రేణితో పాటు ఇతర సౌకర్యాలు లభిస్తాయి.
ముఖ్యమైన తేదీలు..
ఈవెంట్ తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం ఫిబ్రవరి 5, 2026
దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 7, 2026
దరఖాస్తు సవరణ (Edit Window) మార్చి 8 నుండి 15 వరకు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మార్చి 29, 2026
దరఖాస్తు ఫీజు..
UR/OBC/EWS అభ్యర్థులకు: రూ. 2,500
ఇతర అభ్యర్థులకు (SC/ST/PwBD):రూ. 1,250
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, దరఖాస్తు ప్రక్రియ కోసం BSNL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సరైన ప్రణాళికతో సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.






