- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI దెబ్బ.. 11వేల ఉద్యోగాలకు కోతపెట్టిన టాప్ టెక్ దిగ్గజం
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పలు సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ అసెంచర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పలు సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ అసెంచర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న తమ ఉద్యోగులు ఇందులో ఉన్నారని స్పష్టం చేసింది. కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించినరోజే లే ఆఫ్స్ సైతం ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని లే ఆఫ్స్ ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే అసెంచర్ ఐర్లాండ్ లోని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుండగా ఇందులో ఇండియాకు చెందినవారే దాదాపు సగం మంది పనిచేస్తున్నారు. ఇక ఇటీవల అసెంచర్ ఏఐ వినియోగంపై ఎక్కువ దృష్టిపెట్టగా ఏఐ మాదిరిగా పనిచేయలేని, తిరిగి శిక్షణ ఇవ్వలేదని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక మూడు నెలల క్రితం ఈ కంపెనీలో మొత్తం 7,79,000 ఉద్యోగులు పనిచేస్తుండగా ప్రస్తుతం ఆగస్టు నాటికి 7,79,000కి చేరింది. తాజాగా మరో 11వేల ఉద్యోగులను తొలగించింది.






