మలక్‌పేటలో కారు బీభత్సం

by  |
మలక్‌పేటలో కారు బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మలక్‌పేటలో కారు బీభత్సం సృష్టించింది. బాపురాజు అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం డిమార్ట్‌లో సరుకులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా కారు ఒక్కసారిగా టీస్టాల్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో కరెంట్ స్తంభం కిందకు ఒరగడంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.



Next Story