- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీపీపీ సంస్థకు నిరసన సెగ.. కార్ల యజమానులు, డ్రైవర్ల ఆందోళన
<p>దిశ, భూపాలపల్లి: కార్ల అద్దె పెంచాలంటూ కేటీపీపీ సంస్థలో కాంట్రాక్ట్ యజమానుల సంఘం, డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ఐదేండ్లుగా ఒకే ధరను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కేటీపీపీ సంస్థ ప్రధాన ద్వారం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని గుర్తుచేస్తూ.. తమకు చెల్లించే అద్దె సరిపోవడం లేదని చెప్పుకొచ్చారు. దీనికి కుటుంబ పోషణ భారం […]</p>

దిశ, భూపాలపల్లి: కార్ల అద్దె పెంచాలంటూ కేటీపీపీ సంస్థలో కాంట్రాక్ట్ యజమానుల సంఘం, డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ఐదేండ్లుగా ఒకే ధరను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కేటీపీపీ సంస్థ ప్రధాన ద్వారం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని గుర్తుచేస్తూ.. తమకు చెల్లించే అద్దె సరిపోవడం లేదని చెప్పుకొచ్చారు. దీనికి కుటుంబ పోషణ భారం అవుతోందని వాపోయారు. గత కొన్ని నెలలుగా ఇదే విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని అద్దె రేటును పెంచాలన్నారు. ఈ వ్యవహారంపై కేటీపీపీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యజమానుల సంఘం అధ్యక్షులు పిన్నిటి రాజేశ్వరరావు, పొన్నగంటి మల్హర్ రావు, కార్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొచ్చ రాజు, వైస్ ప్రెసిడెంట్ ఉప్పల అనిల్, జాయింట్ సెక్రటరీ ఉడతా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






