మలక్‌పేటలో నడిరోడ్డుపై కారు దగ్ధం

36

దిశ, వెబ్‌డెస్క్ : మలక్‌పేట ప్రధాన రహదారిపై భారీ ప్రమాదం త్రుట్టిలో తప్పింది. శనివారం సాయంత్రం వర్షం మరో 15 నిమిషాల్లో కురుస్తుంది అనగా.. రోడ్డుపై పరుగులు పెడుతున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు నల్గొండ క్రాస్ రోడ్డు దాటి మెట్రో రైల్ ఆర్ఓబీ దగ్గరకు వెళ్లే సరికి ఇంజన్ నుంచి పొగలు.. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అవి నిమిషాల్లోనే కారు లోపలికి వ్యాపించాయి. వెంటనే కారులోని నలుగురు వ్యక్తులు దిగి పరుగులు తీశారు. నిమిషాల్లోని కారు పూర్తిగా దగ్ధం అయింది. ఆ సమయంలో మలక్‌పేట ఏరియాలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.