- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారితో చేరిపోయిన విరాట్ కోహ్లీ
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టుతో కలిశాడు. ఐపీఎల్ 14 సీజన్‌లో ఆర్సీబీ జట్టు తొలి విడత మ్యాచ్‌లు చెన్నైలో ఆడనున్నది. దీంతో జట్టు ప్రస్తుతం అక్కడే ఒక హోటల్‌లో బస చేస్తుండటంతో గురువారం వారితో కోహ్లీ కూడా జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ కోసం 50 రోజుల పాటు బయోబబుల్‌లో ఉండాల్సి ఉన్నది. కాగా, కోహ్లీ గత కొన్ని వారాలుగా ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇంటికి దూరంగా […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టుతో కలిశాడు. ఐపీఎల్ 14 సీజన్‌లో ఆర్సీబీ జట్టు తొలి విడత మ్యాచ్‌లు చెన్నైలో ఆడనున్నది. దీంతో జట్టు ప్రస్తుతం అక్కడే ఒక హోటల్‌లో బస చేస్తుండటంతో గురువారం వారితో కోహ్లీ కూడా జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ కోసం 50 రోజుల పాటు బయోబబుల్‌లో ఉండాల్సి ఉన్నది. కాగా, కోహ్లీ గత కొన్ని వారాలుగా ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇంటికి దూరంగా ఉన్నాడు. వన్డే సిరీస్ ముగియగేనే ముంబయి వెళ్లి కుటుంబంతో కొన్ని రోజులు గడిపిన కోహ్లీ.. తాజాగా చెన్నై చేరుకొని జట్టుతో కలిశాడు. ‘మేం ఈ రోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అందిస్తున్నాము. జట్టు కెప్టెన్ కోహ్లీ చెన్నై చేరుకున్నాడు’ అంటూ ఆర్సీబీ జట్టు ట్వీట్ చేసింది. అంతుకు ముందే ఏబీ డివిలియర్స్ కూడా జట్టుతో చేరాడు.
Next Story






