- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో వాణిజ్యం నెరపలేం: పాక్ పీఎం
by Shamantha N |
<p>ఇస్లామాబాద్: భారత్‌తో వాణిజ్యాన్ని నెరపాలన్న ప్రతిపాదనపై పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. క్యాబినెట్ సభ్యులతో భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. భారత్ నుంచి కాటన్, షుగర్ దిగుమతులను ఇప్పుడే పునరుద్ధరించలేమని నిర్ణయం తీసుకున్నారని, ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని సంబంధిత అధికారులకూ పీఎం ఆదేశాలిచ్చినట్టు తెలిపింది. హైపర్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనను ఇమ్రాన్ సారథ్యంలోని క్యాబినెట్ గురువారమే తిరస్కరించిన సంగతి తెలిసిందే. […]</p>

X
ఇస్లామాబాద్: భారత్‌తో వాణిజ్యాన్ని నెరపాలన్న ప్రతిపాదనపై పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. క్యాబినెట్ సభ్యులతో భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. భారత్ నుంచి కాటన్, షుగర్ దిగుమతులను ఇప్పుడే పునరుద్ధరించలేమని నిర్ణయం తీసుకున్నారని, ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని సంబంధిత అధికారులకూ పీఎం ఆదేశాలిచ్చినట్టు తెలిపింది.
హైపర్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనను ఇమ్రాన్ సారథ్యంలోని క్యాబినెట్ గురువారమే తిరస్కరించిన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తిరిగి కల్పించేవరకు సాధారణ సంబంధాలను పునరుద్ధరించలేమని పేర్కొనడం గమనార్హం.
Next Story






