భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

by  |
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్ట్(checkpost) వ‌ద్ద మ‌ళ్లీ భారీగా గంజాయి(cannabis) ప‌ట్టుబ‌డింది. సుమారు రూ.10 ల‌క్ష‌ల 70వేలు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. భద్రాచలం పట్టణ సీఐ వినోద్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. పోలీసులు అటవీ చెక్‌పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా.. కారు(car)లో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. నిందితులు దారావత్ వెంకన్న, దారావత్ రమణ, రూపవత్ రవి, మేఘవత్ పాండులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు న‌ల్గొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఏపీ నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Next Story