- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మో ఇంత ఖర్చు అయిందా.. అయినా గెలుస్తామా..?
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ పోలింగ్ ముగియడంతోనే అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు. ఫలితాలు వెలువడేందుకు గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు ఎన్నికల ఖర్చును విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యా రు. గ్రేటర్ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో బరిలోకి దిగిన వివిధ పార్టీల నాయకులు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారు. చేతిలో ఉన్న డబ్బుతోపాటు అప్పులు చేసి మరి గ్రేటర్ బరిలోకి దిగారు. ప్రస్తుతం ఎన్నిక లు ముగిసి అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ పోలింగ్ ముగియడంతోనే అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు. ఫలితాలు వెలువడేందుకు గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు ఎన్నికల ఖర్చును విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యా రు. గ్రేటర్ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో బరిలోకి దిగిన వివిధ పార్టీల నాయకులు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారు. చేతిలో ఉన్న డబ్బుతోపాటు అప్పులు చేసి మరి గ్రేటర్ బరిలోకి దిగారు. ప్రస్తుతం ఎన్నిక లు ముగిసి అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్ ముగిసే వరకు చేసిన ఖర్చును లెక్కలు కడుతున్నారు. తమ సొంత డబ్బులు ఎన్ని ఖర్చయ్యాయి, అప్పు ఎంత తెచ్చాం, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది లెక్కలు వేసుకుంటున్నారు.
ఖర్చు చూసి కంగారు..
గ్రేటర్ ఎన్నికల కోసం చేసిన ఖర్చును లెక్క లేసుకుంటున్న అభ్యర్థులు అంకెలను చూసి అవాక్కవుతున్నారు. వామ్మో ఇంత ఖర్చు చేశామా అని లోలోన మదన పడుతున్నారు. ప్రచారం సందర్భంగా అభ్య ర్థులు తమకు నమ్మకమైన వారు, అనుచరుల చేతుల మీదుగా డబ్బులను ఖర్చు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం వారితో కలిసి లెక్కలు సరి చూసుకుంటున్నారు. వారికి ఇ చ్చిందెంత ? ఖర్చు అయ్యిందెంతా ? మిగిలిందెంతా ? అనేది లెక్కలు కడుతున్నారు. కొంత మంది అభ్య ర్థులు తమ సొంత డబ్బులు ఖర్చు కాగా తెలిసిన వారు, బంధు, మిత్రు ల నుంచి అప్పులు చేసి ముందుకు సాగారు. మరికొంత మంది ఆస్తులను సైతం తాకట్టు పెట్టి డబ్బులను పంచి పెట్టారు. ఎన్నికల ప్రచారానికి గడువు తక్కువగా ఉండడంతో లెక్కలు చూసుకోకుండా ముందుకు సాగారు. ఎన్నికలు ముగిసి ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో ఖర్చులను లెక్కకడుతున్నారు. ఇంత ఖర్చు చేసినా గెలుస్తామా.? లేదా.? అని కొంత మంది అభ్యర్థులు ఆందోళన చెందుతుండగా, విజయంపై ధీమా ఉన్న వారు కుటుంబ సభ్యులు, మిత్రులతో ఎంజాయ్ చేస్తున్నారు.






