Sex: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు సెక్స్‌లో పాల్గొనవచ్చా?

by  |
Sex
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పెనుమార్పులు తీసుకువచ్చింది. మానవ జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఆహార నియమాలతోపాటు ఆరోగ్య సూత్రాలను నేర్పించింది. అయితే చాలామందిలో కరోనా-దాంపత్యంపై అపోహలు ఉన్నాయి. కరోనా సోకిన భార్యభర్తలు సెక్స్ లో (sex) పాల్గొనవచ్చా.. పాల్గొంటే ఎన్ని రోజులకు..? అనే అందేహాలు ఉన్నాయి. వాటితోపాటు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనాలి? మొదటి డోస్ తర్వాత శృంగారంలో (sexual life) పాల్గొంటే ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా ? అనే అనుమానాలూ ఉన్నాయి. వీటిపై వైద్యులు ఖచ్చితమైన సమాధానాన్ని ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ కొందరు డాక్టర్లు మాత్రం ఈ సందేహాలపై స్పందించారు.

కరోనా రెండు డోస్ లు తీసుకున్నవారు సెక్స్ చేసేటప్పుడు కండోమ్ని (condom) తప్పక వాడమని సూచిస్తున్నారు. సార్స్ సీవోవీ2 వైర‌స్ అనేది కొత్తది కాబట్టి ఆ వైర‌స్‌ను నిర్వీర్యం చేసేందుకే టీకాల‌ను అభివృద్ధి చేశార‌ని, ఆ టీకాలు వాడ‌డం వ‌ల్ల ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల వ‌స్తాయా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమ‌ని స్పష్టం చేస్తున్నారు. దీని కారణంగానే కరోనా టీకా తీసుకున్న మూడు వారాల తర్వాత కలవడం మంచిదని, అప్పుడు కూడా కండోమ్ వాడడం శ్రేయస్కరమని తెలుపుతున్నారు. ఇకపోతే మహిళలు డోస్ తీసుకున్నాక ఏమైనా సమస్యలు ఉంటే గైనకాలజిస్ట్ ని సంప్రదించడం ఉత్తమని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed