కొవిడ్‌‌‌ను నిరోధించే ‘నైట్రిక్ ఆక్సైడ్’

271
nitric oxid

దిశ, ఫీచర్స్ : కొవిడ్-19 సృష్టించిన భయాందోళన నుంచి ప్రజలు పూర్తిగా బయటకు రాకముందే, సెకండ్ వేవ్ మరింత వేగంగా ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్పీడప్ అందుకున్నా.. ఈ రోజు వరకు కూడా కొవిడ్ -19‌ను నియంత్రణకు నిర్దిష్టమైన మందు అనేది లేదు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు SARS-CoV2కు వ్యతిరేకంగా సమర్థవంతమైన యాంటీవైరల్ ఔ‌షధాలపై పనిచేస్తుండగా, కొందరు ఇతర ప్రత్నామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే థెరపీ’ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ థెరపీ ఏంటి? ఏమైనా దుష్ప్రభావాలున్నాయా? ఆ వివరాలు తెలుసుకుందాం.

కెనడాకు చెందిన సానోటైజ్ ఔషధ సంస్థ తయారు చేసిన నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) వాడకం కోసం యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా ప్రభుత్వాల నుంచి అత్యవసర అనుమతి కోరింది. ఎన్‌హెచ్‌ఎస్ (NHS), సెయింట్ పీటర్స్ ఆస్పత్రుల సహకారంతో ఈ నాసల్ స్ప్రే రెండో దశ ప్రయోగ ఫలితాలను ఇటీవలే ప్రకటించిన సంస్థ.. కొవిడ్ -19కు కారణమయ్యే వైరస్‌ను తమ స్ప్రే 99.9% చంపుతుందని, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొంది. కాగా మానవ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రాముఖ్యత, దాని వైద్య లక్షణాలను మొదట స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫెరిడ్ మురాడ్ కనుగొనగా.. ఇది బహుముఖ అణువు అని, దాదాపు మానవ శరీర భాగాలన్నింటిపై నియంత్రణ కలిగి ఉంటుందని ఆయన అన్నారు.

coronavirus

నైట్రిక్ ఆక్సైడ్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?

బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, హెల్మింత్స్(Helminths), ప్రోటోజోవా, వైరస్‌లకు వ్యతిరేకంగా విస్తృత యాంటీమైక్రోబయల్ ప్రభావాన్ని నైట్రిక్ ఆక్సైడ్ కలిగి ఉంటుంది. SARS-CoV-2 సంక్రమణకు చికిత్సగా నైట్రిక్ ఆక్సైడ్(NO) సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, పరిశోధకులు SARS-CoV-2 రెప్లికేషన్‌పై దాని విట్రో యాంటీవైరల్ ప్రభావాన్ని అంచనా వేశారు. వారి ఫలితాలను సెప్టెంబర్ 2020 లో ప్రచురించగా, SARS-CoV-2 పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిన ఏకైక పదార్థం నైట్రిక్ ఆక్సైడ్ అని శాస్త్రవేత్తల్లో ఒకరు తెలిపారు.

స్ప్రే ఫలితం 

సెయింట్ పీటర్స్ హాస్పిటల్స్, ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, బెర్క్‌షైర్, సర్రే పాథాలజీ సర్వీసెస్‌తో పాటు వాంకోవర్ ఆధారిత బయోటెక్ సంస్థ సానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్స్ ఈ స్ప్రేను అభివృద్ధి చేశాయి. ఇది కొద్దిమొత్తంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేయగా.. SARS-CoV-2‌‌తో సహా వైరస్‌లను సమర్థవంతంగా చంపుతుంది. అంతేకాదు ఎలాంటి వైరస్‌ల‌నైనా చంపగల సామర్థ్యం దీనికి ఉంది’ అని సానోటైజ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ గిల్లీ రెగెవ్ అన్నారు.

nasal spray

ట్రయల్ రిజల్ట్స్ 

స్ప్రే.. మొదటి దశ ట్రయల్స్ జనవరి 11‌న సర్రేలోని NHS ఫౌండేషన్ ట్రస్ట్‌లో ప్రారంభం కాగా, నైట్రిక్ ఆక్సైడ్ వైరస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక సెకండ్ ట్రయల్స్‌లో ప్రకటించిన ఫలితాల ప్రకారం ఎర్లీ ట్రీట్‌మెంట్ SARS-CoV2 స్థాయిని తగ్గించటానికి సాయపడింది. స్ప్రేతో చికిత్స పొందిన రోగుల్లో మొదటి 24 గంటల్లో సగటున 95% వైరల్ లోడ్‌ తగ్గుదల కనిపించగా, 72 గంటల్లో 99% వైరస్ అంతమైంది. వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. వైరస్‌తో కూడిన గాలిలోనూ ఈ స్ప్రే వైరల్ భారాన్ని గణనీయంగా తగ్గించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. మానవుల్లో వైరల్ భారాన్ని తగ్గించడానికి ఇప్పటివరకు నిరూపించిన ఏకైక నావల్ చికిత్స ఇదే. వాయుమార్గాల్లోని వైరస్‌ను చంపడానికి తయారు చేసిన ఈ స్ప్రే.. వైరస్ ఊపిరితిత్తులకు వ్యాపించకుండా నిరోధిస్తుంది.

క్లియరెన్స్ వచ్చిందా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా అత్యవసర వినియోగ అధికారాన్ని (EUA) ఇవ్వలేదు. డాక్టర్ రెగెవ్ ప్రకారం.. ఇజ్రాయెల్, బహ్రెయిన్ ఈ స్ర్పేకు వైద్య పరికరంగా ఈయూఏ(ఎమర్జెన్సీ యూజ్ అథరైజేషన్)‌ను ఇచ్చాయి. కాగా డెవలపర్లు యూకేలోనూ ఈయూఏ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. మూడో దశ ట్రయల్ కూడా చేసే యోచనలో సానోటైజ్ ఉండగా, డెవలపర్లు భారతదేశంలోని కొన్ని ఔషధ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. దీన్ని ఇజ్రాయెల్‌లో ఎనోవిడ్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.

ఇండియాలోనూ ప్రయోగాలు..

భారతీయ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలపై పనిచేస్తున్నాయి. శాస్త్రీయంగా ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచన, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నైట్రిక్ ఆక్సైడ్ యాంటీవైరల్ చర్యపై స్పష్టమైన డేటా లేదు. దీనిపై అనేక సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఒక్క నైట్రిక్ ఆక్సైడ్ అనే కాదు సెవరల్ మాలిక్యుల్స్ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి, సీఎస్‌ఐఆర్‌లో కూడా 15 అణువులు అభివృద్ధి దశలో ఉన్నాయి. వాటిపై కొన్ని నెలల్లోనే క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లవచ్చు. నైట్రిక్ ఆక్సైడ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి, అక్కడి వైద్యులు పరీక్షించే చోట ఎన్‌వో చిన్న మొత్తాలను రోగికి ఇవ్వగలిగితే అతను/ఆమె బాగా ఊ‌పిరి పీల్చుకోవచ్చు. ఇది రక్తనాళాలను సడలిస్తుంది.
– ప్రొఫెసర్ విశ్వకర్మ , సీఎస్ఐఆర్ కొవిడ్ స్ట్రాటజీ గ్రూప్ చైర్మన్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..