శంషాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

by  |
శంషాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ ను నిర్మానుష్య ప్రాంతంలో పారబోయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండకు కెమికల్ మండి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో శంషాబాద్ పరిసర ప్రాంతం దట్టమైన పొగతో కమ్ముకుంంది. ఓవైపు మంటలు, మరోవైపు పొగలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి గ్రామ శివారు లోని నిర్మానుష ప్రాంతంలో ప్రాణాంతక కెమికల్ పార పోసి నిప్పు పెట్టారు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి కాదు. అంతకముందు ఒకసారీ ఇలానే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇలా కెమికల్ పోసి నిప్పంటించడంతో దాని నుండి వచ్చే పొగతో శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మవ్యాధులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. వెంటనే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed