డయాలసిస్ సేవల కోసం కాల్‌హెల్త్, నెఫ్రోప్లస్ ఒప్పందం!

by  |
డయాలసిస్ సేవల కోసం కాల్‌హెల్త్, నెఫ్రోప్లస్ ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద డయాలసిస్ సెంటర్‌ను నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్, ఆరోగ్య సేవలను అందిస్తున్న కాల్‌హెల్త్ సంస్థలు ఉమ్మడి సేవలను అందించేందుకు కీలక ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇరు సంస్థలు దీర్ఘకాలికంగా ఇబ్బందిపడుతున్న రోగులకు ఇంటి వద్దే డయాలసిస్ సేవలను అందించేందుకు ‘ఎట్ హోమ్ డయాలసిస్’ పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. పస్తుతం హైదరాబద్‌లో సేవలందించనున్నామని, రానున్న రోజుల్లో దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు ఇరు సంస్థలు వెల్లడించాయి.

గతేడాది కొవిడ్-19 వ్యాప్తి తర్వాత డయాలసిస్ తీసుకోవడంలో అనేక సవాళ్లు ఎదురైన నేపథ్యంలోనే ఈ కొత్త నిర్ణయానికి వచ్చినట్టు నెఫ్రోప్లస్ సీఈఓ విక్రమ్ ఉప్పల చెప్పారు. ఇప్పటికీ కరోనా భయంతో డయాలసిస్ సెంటర్‌కు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని, వారికోసమే ఈ సేవలను ప్రారంభించామని ఆయన వివరించారు. కాల్‌హెల్త్ సంస్థ వినియోగదారుల వివరాలపై దృష్టి సారిస్తుందని, ఈ సేవలతో దేశీయంగా డయాలసిస్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, రోగులకు భరోసా ఇవ్వడంతో పాటు తమకు కావాల్సిన సమయానికి అనుగుణంగా సేవలను పొందే వీలుంటుందని కాల్‌హెల్త్ సీఈఓ హరి తాలపల్లి వెల్లడించారు.


Next Story

Most Viewed