రేపే మంత్రివర్గ విస్తరణ

44

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా మంత్రి వర్గంలో ఏడుగురికి చోటు కల్పించనున్నారు. కొత్త మంత్రి వర్గ జాబితాను బుధవారం సాయంత్రం 4గంటలకు ప్రకటించనున్నట్టు సీఎం యడియూరప్ప తెలిపారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గంలో అధికంగా 34 మందిని నియమించవచ్చు. అయితే ప్రస్తుతం మంత్రి వర్గంలో 27 మంది ఉన్నారు. కాగా మంత్రి వర్గ విస్తరణ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో యడ్యూరప్ప ఆదివారం సమావేశం అయిన సంగతి తెలిసిందే.