నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ.. ఆప్‌కు ఒకటి.. సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-14 00:19:42  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాదిలో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై అనేక సర్వేలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్‌ఎస్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశముందని ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్‌ఎస్ సర్వేలో తేలింది. పంజాబ్ మినహా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, [&hellip;]</p>

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ.. ఆప్‌కు ఒకటి..  సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాదిలో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై అనేక సర్వేలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్‌ఎస్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

ఐదు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశముందని ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్‌ఎస్ సర్వేలో తేలింది. పంజాబ్ మినహా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురుతుందని వెల్లడించింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశముందని, ఆప్‌కు 51, కాంగ్రెస్‌కు 46, అకాలీదళ్‌కు 20 సీట్లు వస్తాయని తెలిపింది.

Next Story