Buy Now Pay Later : చెల్లింపులకు పెరుగుతున్న డిమాండ్!

by  |
Buy Now Pay Later :  చెల్లింపులకు పెరుగుతున్న డిమాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బై బౌ-పే లేటర్ ( Buy Now Pay Later) పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాబోయే నాలుగేళ్ల కాలంలో ఈ పరిశ్రమ ఏకంగా 10 రెట్లు పెరగనుందని, కోటి మంది ఆన్‌లైన్ వినియోగదారులు తక్కువ రిస్క్‌తో కూడిన వడ్డీ లేని క్రెడిట్‌కు ఆకర్షితులవుతారని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ అంచనాల ప్రకారం.. భారత్‌లో బై నౌ-పే లేటర్ ( Buy Now Pay Later) ప్రస్తుతం 3-3.5 బిలియన్ డాలర్ల(రూ. 22,000 కోట్ల నుంచి 26,000 కోట్ల) నుంచి 2026 నాటికి 45-50 బిలియన్ డాలర్లు(రూ. 2.96 లక్షల కోట్ల నుంచి రూ. 3.7 లక్షల కోట్ల)కు చేరుకోనుంది. అలాగే, ఈ పరిశ్రమ వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 1-1.5 కోట్ల మంది ఉండగా, 2026 నాటికి 8-10 కోట్ల మందికి చేరుకుంటుందని రెడ్‌సీర్ అంచనా వేసింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ విధానంలో ఇస్తున్న క్రెడిట్ రూ. లక్ష మాత్రమే ఉంది. ఇది సాధారణ క్రెడిట్ కార్డులు ఇచ్చే దాంతో పోలిస్తే చాలా తక్కువ.

కార్డ్ మార్కెట్‌ను అధిగమించేందుకు మరికొత సమయం పడుతుందని మాక్‌క్వయిరీ రీసెర్చ్ సంస్థ వివరించింది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మోబిక్విక్ రెండేళ్లలో ఈ విభాగంలో రెట్టింపు వృద్ధి చూడనుందని మాక్‌క్వయిరీ తెలిపింది. ఇటీవల దేశీయంగా ‘బై నౌ-పే లేటర్’ విధానానికి భారీ డిమాండ్‌ను చూస్తున్నాం. ఈ ఏడాది పండుగ సీజన్ కారణంగా గతేడాది కంటే ఈసారి ఈ విభాగలో 25-30 శాతం డిమాండ్ వృద్ధి చూడగలిగామని క్యాష్ఈ సంస్థ సీఈఓ యోగి సదానా వెల్లడించారు.


Next Story

Most Viewed