Deepinder Goyal: విమానయాన రంగంలోకి జొమాటో క్-ఫౌండర్ దీపిందర్ గోయల్

by S Gopi |

వెనుకబడిన ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సరసమైన ధరలో సేవలందించే హామీ ఇచ్చారు.

Deepinder Goyal: విమానయాన రంగంలోకి జొమాటో క్-ఫౌండర్ దీపిందర్ గోయల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటొ కో-ఫౌండర్ దీపిందర్ గోయల్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఫుడ్ డెలివరీ విభాగంలో ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగేలా జొమాటోను నిలిపిన ఆయన, తాజాగా భవిష్యత్తులో స్వల్ప-దూరానికి విమానయాన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తునట్టు పేర్కొన్నారు. దీనికోసం ఎల్ఏటీ ఏరోస్పేస్‌కు మద్దతిస్తునంట్టు ఆ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు సురోభి దాస్ తన లింక్‌డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు. ఏవియేషన్ స్టార్టప్‌పై ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సరసమైన ధరలో సేవలందించే హామీ ఇచ్చారు. జొమాటో అభివృద్ధి కోసం ప్రయాణించే సమయంలో మాకు అనేక సందర్భాల్లో ఎదురైన ప్రశ్న.. ప్రాంతీయ విమానయాన ప్రయాణం ఎందుకు ఇంత ఖరీదైనది, మెట్రో నగరాలను దాటి ఎందుకనీ సేవలు విస్తరించలేదు? అని. దేశంలో 450 కంటే ఎక్కువ ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్నాయి. కానీ 150 కంటే తక్కువ వాణిజ్య కార్యకలాపాలను అందిస్తున్నాయి. అంటే దేశంలోని విమానయాన సామర్థ్యంలో దాదాపు మూడింట రెండొంతులు వాడకంలో లేదు. ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాల్లోని లక్షలాది మంది ఇప్పటికీ రోడ్డు లేదా రైలు ప్రయాణంలోనే గంటలకు గంటలు సమయాన్ని కోల్పోతున్నారని సురోభి దాస్ తన పోస్ట్‌లో వివరించారు. బస్సులో ప్రయాణించినంత సులభంగా, సౌకర్యవంతంగా విమాన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఎల్ఏటీ ఏరోస్పేస్ నిర్మించామని పేర్కొన్నారు.

Next Story