Platform Fee: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ, జొమాటో

by S Gopi |

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైన వేళ డిమాండ్‌కు తగిన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ చెబుతున్నాయి.

Platform Fee: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ, జొమాటో
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవల సంస్థలు జొమాటో, స్విగ్గీ వరుసగా తమ ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచాయి. దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైన వేళ డిమాండ్‌కు తగిన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ చెబుతున్నాయి. స్విగ్గీ అధిక డిమాండ్ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 14 నుంచి రూ. 15కి పెంచింది. గత నెలలోనే కంపెనీ దీన్ని రూ. 12 నుంచి రూ. 14కి పెంచిన సంగతి తెలిసిందే. ఫుడ్ డెలివరీ సేవలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, తాత్కాలిక ఈ పెంపు నిర్ణయం తీసుకున్నామని స్విగ్గీ అధికారికంగా వెల్లడించింది. పండుగ సీజన్ తర్వాత దాన్ని తిరిగి రూ. 12కి తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు, స్విగ్గీ బాటలోనే జొమాటో కూడా పండుగ సీజన్ డిమాండ్ తీర్చేందుకు ప్రస్తుతం రూ. 10 ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ సమయంలో ఆర్డర్లు భారీగా పెరుగుతాయని, దానివల్ల డెలివరీ ఏజెంట్లకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది, నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ కారణంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Next Story