Zomato: జొమాటోకు రూ. 40 కోట్లకు పైగా పన్ను నోటీసులు

by S Gopi |

ఎటర్నల్ లిమిటెడ్ పేరుమీదే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విభాగం మూడు పన్ను నోటీసులు ఇచ్చింది.

Zomato: జొమాటోకు రూ. 40 కోట్లకు పైగా పన్ను నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటోకు జీఎస్టీ అథారిటీ భారీ మొత్తంలో పన్ను నోటీసులు జారీ చేసింది. ఇటీవలే జొమాటో తన బ్రాండింగ్‌ను ఎంటర్నల్ లిమిటెడ్‌కి మార్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎటర్నల్ లిమిటెడ్ పేరుమీదే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విభాగం మూడు పన్ను నోటీసులు ఇచ్చింది. 2017, జూలై నుంచి 2020, మార్చి మధ్య కాలంలో కంపెనీ పన్ను చెల్లింపుల విషయంలో ఔట్‌పుట్ ట్యాక్‌ను తక్కువగా చెల్లించడం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ. 40 కోట్లకు పైగా పన్ను డిమాండ్ చేస్తూ నొటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎటర్నల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌కు తెలియజేసింది. బెంగళూరు జాయింట్ కమిషనర్ పేరుతో ఉత్తర్వులు ఇవ్వగా, మొత్తం పన్ను డిమాండ్‌లో రూ. 17.19 కోట్లు జీఎస్టీ, రూ. 21.42 కోట్లు వడ్డీ, రూ. 1.71 కోట్లు జరిమానా ఉన్నట్టు వివరించింది. అయితే, జీఎస్టీ అధికారులు ఇచ్చిన నోటీసులను తాము సవాలు చేస్తామని ఎటర్నల్ స్పష్టం చేసింది. న్యాయవాదుల అభిప్రాయం మేరకు అప్పీలుకు వెళ్తామని, తాము ఎలాంటి పన్ను ఉల్లంఘనలకు పాల్పడలేదని పేర్కొంది.

Next Story