విమానయాన రంగంలోకి అడుగుపెట్టనున్న జొమాటో సీఈఓ

by Yella Dhawani Reddy |

ఫుడ్ డెలివరీ రంగంలో దూసుకెళ్తున్న జొమాటో (Zomato) మాతృ సంస్థ ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ డీపిందర్ గోయల్ ఇప్పుడు పౌర విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నారు.

విమానయాన రంగంలోకి అడుగుపెట్టనున్న జొమాటో సీఈఓ
X

దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ డెలివరీ రంగంలో దూసుకెళ్తున్న జొమాటో (Zomato) మాతృ సంస్థ ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ డీపిందర్ గోయల్ ఇప్పుడు పౌర విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే 'ఎల్ఏటీ ఏరోస్పేస్‌ (LAT Aerospace)' పేరుతో ఏవియేషన్ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన, తాజాగా బాంబర్డియర్ గ్లోబల్ సిరీస్‌కు చెందిన లగ్జరీ ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ జెట్ జూన్ నెల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని వీఐపీ బే వద్ద కనిపిస్తోంది. జులై 16 (నేటి) నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇక ఈ విమానం నిర్వహణ, ఇంజినీరింగ్‌ బాధ్యతలను ఇందమెర్‌ ఎంజెట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌, బర్డ్‌ ఎగ్జిక్యూజెట్‌ ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ కంపెనీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ జెట్ స్పెసిఫికేషన్స్‌ ఇంకా బయటపడలేదు. కాగా, ఇటీవల డీపిందర్ గోయల్ రూ.52.3 కోట్లకు గురుగ్రామ్‌ డీఎల్‌ఎఫ్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం జూన్ 2025 నాటికి ఆయన జొమాటోలో 3.83% వాటా కలిగి ఉన్నారు. వాటాల ప్రస్తుత విలువ రూ.9,847 కోట్లుగా ఉండగా, ఆయన మొత్తం నికర సంపద $1.6 బిలియన్లకు పైగా (సుమారు రూ.13,000 కోట్లు) ఉంటుందని అంచనా. టెక్ రంగం నుంచే తన ప్రయాణం ప్రారంభించిన గోయల్, ఇప్పుడు గగనతలాన్ని కూడా తన వ్యాపార వ్యూహాల్లో భాగం చేసుకుంటున్నారు.

Next Story