- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zerodha: ట్రేడర్ల కోసం జీరోధా కొత్త ఫీచర్
ఈ ఫీచర్ ద్వరా ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడం లేదా పెండింగ్ ఆర్డర్లను క్యాన్సిల్ చేయవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ జెరోధా ఇన్వెస్టర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. కైట్ బ్యాకప్ పేరుతో వాట్సాప్ ద్వారా ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్‌ను ప్రారంభించింది. ప్రధాన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కైట్‌లో ఎప్పుడైన సాంకేతిక సమస్యలు గానీ, ఔటేజ్ ఎదురైనప్పుడు ఈ ఫీచర్ ద్వరా ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడం లేదా పెండింగ్ ఆర్డర్లను క్యాన్సిల్ చేయవచ్చు. సాధారణంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజీలతో లీజ్ లైన్‌ల ద్వారా కనెక్ట్ అవడం, క్లౌడ్, ఫిజికల్ డేటా సెంటర్లలో ఆపరేట్ చేయడం లాంటి అనేక టెక్ వ్యవస్థలపై ఆధారపడి పనిచేస్తాయి. వీటిలో ఎక్కడైనా చిన్న లోపం ఎదురైనా సరే ట్రేడింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి బ్యాకప్ అనేది అత్యంత ముఖ్యం. ఈ నేపథ్యంలో జెరోధా ట్రేడర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కైట్ బ్యాకప్ ద్వారా అదనపు భద్రతను అందించనుంది. దీని గురించి మాట్లాడిన జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఎక్స్ఛేంజ్ కనెక్షన్ నుంచి క్లౌడ్ సేవల వరక్ ఎక్కడ ఏ చిన్న లోపం వచ్చినా సమస్యే. అందుకోసమే తాము అనేక భద్రతా సమస్యలను పర్యవేక్షిస్తూ, అప్రమత్తంగా ఉంటాం. దీన్ని మరింత విస్తరించేందుకే వాట్సాప్ ద్వారా పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే ఎమర్జెన్సీ మోడ్‌ను సిద్ధం చేశామని వివరించారు. మార్కెట్ కార్యకలాపాలు జరిగే ఏ సమయంలోనైనా సాంకేతిక లోపం ఏర్పడితే కైట్ వెబ్, మొబైల్ యాప్ రెండూ పనిచేయవు. అలాంటి సమయంలో ఈ ఎమర్జెన్సీ మోడ్ ద్వారా ఆర్డర్లను క్యాన్సిల్ చేయవచ్చు, పొజిషన్లను క్లోజ్ చేసేందుకు వీలవుతుందని వెల్లడించారు.






