- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zepto: ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న రెండో యాప్‌గా జెప్టో
అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ అత్యధిక డౌన్‌లోడ్‌లతో అగ్రస్థానంలో నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో అరుదైన ఘనతను సాధించింది. తాజాగా గతేడాదికి సంబంధించి సెన్సార్ టవర్ విడుదల చేసిన డేటాలో జెప్టో కంపెనీ ఫుడ్ అండ్ డ్రింక్స్ యాప్స్ విభాగంలో ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన జాబితాలో రెండో ర్యాంకు సాధించింది. అంతర్జాతీయంగా అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ అత్యధిక డౌన్‌లోడ్‌లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ నుంచి జెప్టో తర్వాత మరో క్విక్ కామర్స్ కంపెనీ బ్లింక్ఇట్ అత్యధిక డౌన్‌లోడ్ యాప్‌లలో పదో స్థానంలో నిలిచింది. ఇతర విభాగాల్లో భారత్ నుంచి ఫుడ్ అండ్ గ్రాసరీ విభాగంలో జొమాటో ఐదో స్థానంలో, స్విగ్గీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. సెన్సార్ టవర్ ప్రకారం, 2024లో దేశీయంగా జెప్టో కంపెనీ డౌన్‌లోడ్‌లలో ఏకంగా 300 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా కంపెనీ 'బై నౌ-పే లేటర్ ' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ఎక్కువ మంది కస్టమర్లు జెప్టోను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఫీచర్ కారణంగా గతేడాది చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ వినియోగదారుల సంఖ్యలోనూ బ్లింక్ఇట్‌ను అధిగమించిందని సెన్సార్ టవర్ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో గతేడాది ఏకంగా 35.3 కోట్ల అప్లికేషన్లు డౌన్‌లోడ్ అయ్యాయని నివేదిక తెలిపింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 43 శాతం అధికమని పేర్కొంది.






