- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డు
భౌతికంగా కార్డు తీసుకెళ్లే పనిలేకుండా, కావాలన్నప్పుడు వాలెట్‌లోని ఆధార్ వివరాలను వెరిఫికేషన్ కోసం ఇవ్వొచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ వాలెట్‌లో అధార్ వివరాలను స్టోర్ చేసుకునే వీలు కల్పిస్తోంది. దీనికోసం గూగుల్ కంపెనీ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భౌతికంగా కార్డు తీసుకెళ్లే పనిలేకుండా, కావాలన్నప్పుడు వాలెట్‌లోని ఆధార్ వివరాలను వెరిఫికేషన్ కోసం ఇవ్వొచ్చు. గూగుల్ వాలెట్‌లో ఉండే ఆదార్ వివారాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అవసరాలకు ఉపయోగించవచ్చు. డివైజ్‌లలో సేవ్ చేసుకోవడం ద్వారా రోజువారీ ఉపయోగాల కోసం 'సురక్షితమైన, డిజిటల్-ఫస్ట్ ఐడీ' అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది. ప్రధానంగా ఈ విధానంలో 'సెలెక్టివ్ డిస్‌క్లోజర్ వంటి అధునాతన గోప్యతా ఫీచర్లు' ఉన్నాయని గూగుల్ స్పష్టం చేసింది. దీనివల్ల అవసరమైనప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఐడీకి సంబంధించిన వివరాలను పంచుకోవచ్చు, అలాగే ప్రతి ఒక్కరూ తమ ఐడెంటిటీని సురక్షితంగా నిర్వహించుకునేందుకు వీలవుతుంది. ఈ సదుపాయం కోసం గూగుల్ వాలెట్ యాప్‌లో 'యాడ్ వాలెట్' ఆప్షన్ ఎంచుకోవాలి. మెనూలో ఆధార్ కార్డ్ క్లిక్ చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. యూఐడీఏఐ ఆధార్ యాప్‌లో షేర్ ఐడీ ద్వారా గూగుల్ వాలెట్‌లో వివరాలు స్టోర్ అవుతాయి.






