ఇయర్ ఎండింగ్‌ డే ఫుల్ జోష్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

by Kema Shiva Kumar |

సంవత్సరం చివరి రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ షేర్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.

ఇయర్ ఎండింగ్‌ డే ఫుల్ జోష్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంవత్సరం చివరి రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ షేర్ మార్కెట్ సూచీలు (Indian Stock Market Indices) లాభాలతో ముగిశాయి. వరుస నష్టాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి బలమైన కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 545.52 పాయింట్ల లాభంతో 85,220.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 190.75 పాయింట్ల లాభంతో 26,129.60 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా దాదాపు 1 శాతం పైగా లాభపడ్డాయి.

ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి దిగుమతి స్టీల్ ఫ్లాట్ ప్రొడక్ట్స్‌పై 12 శాతం సేఫ్‌గార్డ్ డ్యూటీ విధించడం వల్ల డొమెస్టిక్ స్టీల్ ప్రొడ్యూసర్లకు రక్షణ లభించింది. దీంతో Tata Steel, JSW Steel వంటి షేర్లు బలంగా పెరిగాయి. మెటల్ సెక్టార్ మొత్తం టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇక ఆయిల్ అండ్ గ్యాస్, PSU బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, పవర్ వంటి రంగాల్లో విస్తృత కొనుగోళ్లు జరిగాయి. ఓఎంసీలు, ఎనర్జీ స్టాక్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవడంతో సంవత్సరం చివరి రోజు స్టాక్ మార్కెట్ సూచీలు బలపడ్డాయి. సంవత్సరం చివరి రోజు ఇలా భారీ లాభాలతో ముగియడం ఇన్వెస్టర్లకు సంతోషాన్ని కలిగించింది.

Next Story