- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yamaha: ఈవీ స్కూటర్లు సహా 10 కొత్త బైకులను విడుదల చేయనున్న యమహా
ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు కొత్తగా 10 మోడళ్ల బైకులను విడుదల చేస్తామని మంగళవారం ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయరీ సంస్థ యమహా భారత మార్కెట్లో మరింత వేగంగా విస్తరించడంపై దృష్టి సారించినట్టు వెల్లడించింది. దీనికోసం దేశీయంగా తదుపరి దశ వృద్ధి ప్రణాళికలో భాగంగా 2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు కొత్తగా 10 మోడళ్ల బైకులను విడుదల చేస్తామని మంగళవారం ప్రకటనలో తెలిపింది. భారత టూవీలర్ మార్కెట్ మరింత వరిస్తించేందుకు, వృద్ధి సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో మధ్యతరగతి ఆదాయం పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తమ అమ్మకాలు 10 శాతం మేర పెరుగుతాయనే నమ్మకం తమకుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ ఇటారు ఒటాని చెప్పారు. భవిష్యత్తులో ముఖ్యంగా స్కూటర్లు, ప్రీమియం, డీలక్స్ మోటార్‌సైకిళ్లపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. మొత్తం ప్రపంచ వాహన రంగం వృద్ధికే భారత్ కేంద్రంగా ఉంది. అందుకే ప్రీమియం, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంపై తాము ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామన్నారు. కంపెనీ కొత్త ప్రణాళికల్లో భాగంగా 2026 చివరి నాటికి 10 కొత్త మోడళ్లు, 20కి పైగా అప్‌గ్రేడ్ ద్విచక్ర వాహనాలను తీసుకురానుంది. కాగా, మంగళవారం కంపెనీ రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఎక్స్ఎస్ఆర్155, ఎఫ్‌జెడ్-రేవ్ బైకులను కంపెనీ తీసుకొచ్చింది. 150-160సీసీ సెగ్మెంట్‌లో వీటిని లాంచ్ చేయగా, ఎక్స్ఎస్ఆర్ ప్రారంభ ధరను రూ. 1,49,990(ఎక్స్‌షోరూమ్)గా, ఎఫ్‌జెడ్-రేవ్ ధరను రూ. 1,17,218(ఎక్స్‌హోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది.






