- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. ఒక్కసారిగా టమాటా ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే?
టమాటా ధరలు ఎప్పుడు పతనమవుతాయో? ఎప్పుడు పెరుగుతాయో? చెప్పలేం. మొన్నటి వరకు కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్కసారిగా భారీగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: టమాటా ధరలు ఎప్పుడు పతనమవుతాయో? ఎప్పుడు పెరుగుతాయో? చెప్పలేం. మొన్నటి వరకు టమాటా ధరలు (Tomato prices) భారీగా పడిపోయి కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్కసారిగా భారీగా పెరిగింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.60 నుంచి 70 పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ టమాటా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా వ్యాపారులు అంటున్నారు. ఇక ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొనేందుకు వినియోగదారులు జంకుతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుబడి కూడా ఆగిపోవటం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు గతంతో పోల్చితే సగం సరుకే దిగుమతి అవుతోంది. మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగితే పంట తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో దిగుబడి తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో కేజీ టమాటా ధర రూ.50 నుంచి 60 వరకు పలుకుతుంది. ఇక, మిగతా జిల్లాల్లో 35- 45 వరకు పలుకుతుంది.






