- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Prices: ప్రపంచ ధోరణికి భిన్నంగా భారత్‌లో పెరుగుతున్న బంగారం
2026లో ఇప్పటివరకు ఇండియాలో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా 17.6 శాతం రాబడి దక్కింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు మే నెలలో కాస్త తగ్గినా, మన దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి పరుగు ఆపడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తాజా లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా బంగారం ధర 1.4 శాతం తగ్గితే, అదే సమయంలో భారత్‌లో మాత్రం ఏకంగా 4.1 శాతం పెరిగింది. దీనివల్ల 2026లో ఇప్పటివరకు ఇండియాలో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా 17.6 శాతం రాబడి దక్కింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ తగ్గడం, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న గందరగోళ పరిస్థితులే మన దేశంలో బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. భారత్, టర్కీ వంటి దేశాల్లో స్థానిక డిమాండ్ వల్ల పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
మరోవైపు అమెరికా వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత లేనప్పటికీ.. భారత్, చైనా లాంటి పెద్ద దేశాల నుంచి వస్తున్న భారీ కొనుగోళ్ల వల్ల లాంగ్ టర్మ్‌లో బంగారం ధరలకు మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. రేట్లు బాగా పెరిగిపోవడంతో చాలా చోట్ల నగల షాపుల్లో కస్టమర్ల కొనుగోళ్లు కాస్త తగ్గాయి, అలాగే డిజిటల్ గోల్డ్ (ఈటీఎఫ్‌ల) వైపు కూడా పెట్టుబడుల జోరు కొంచెం మందగించింది. రాబోయే రోజుల్లో చమురు ధరలు గనుక ఒక్కసారిగా పెరిగితే అమెరికా డాలర్ మరింత బలంగా మారి, బంగారం ధరలపై కాస్త ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొన్నారు.






