మహిళల కోసం స్పెషల్ షూ.. ఇక కామాంధులకు నరకమే !

by velandi.Saikiran |

దేశవ్యాప్తంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు (Womens) కనబడితే చాలు... లైంగిక దాడులు చేసి.. నరకం చూపిస్తున్నారు

మహిళల కోసం స్పెషల్ షూ.. ఇక కామాంధులకు నరకమే !
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు (Womens) కనబడితే చాలు... లైంగిక దాడులు చేసి.. నరకం చూపిస్తున్నారు దుర్మార్గులు. అయితే అలాంటి కామాంధులకు చెక్ పెట్టేందుకు.. అదిరిపోయే షూలు ( Shoes) వచ్చేసాయి. మహిళలను వేధించే వారికి.. కరెంటు షాక్ ఇచ్చేలా.. కొత్తరకం షూలు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ కొత్త రకపు షూలను రాజస్థాన్ రాష్ట్రానికి (Rajasthan ) సంబంధించిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి తయారు చేశాడు.

షూల తయారీ, ఎలా పని చేస్తాయి ?

రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా లీలి గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి వివేక్ చౌదరి ( Vivek Chaudhary).. దాదాపు రెండు నెలల పాటు కష్టపడి ఈ స్పెషల్ షూ లను తయారు చేశాడు. 3500 ఖర్చుతో... ఈ ప్రత్యేక బూట్లను ఏర్పాటు చేసి... మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాడు. అయితే ఈ ప్రత్యేకమైన బూట్లు ధరించిన మహిళ... ఇబ్బందుల్లో ఉంటే తనకు తాను కాపాడుకోవచ్చు. ఎవరైనా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడితే... వెంటనే ఆ బూట్లలో వెనుక భాగాన్ని బలంగా నేల వైపు నెట్టాల్సి ఉంటుంది. ఈ తరుణంలోనే ఆ బూట్లలో ఉన్న ఒక పరికరం యాక్టివేట్ అయి... అవతలి వ్యక్తికి కరెంటు షాక్ ( electric shock ) వస్తుంది. దీంతో.. దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తి.. కింద పడిపోవడం జరుగుతుంది. అయితే బూట్లలో ఉన్న ఈ ప్రత్యేక పరికరానికి ఒకసారి చార్జింగ్ పెడితే 1,000 షాక్ లు ఇస్తుందట. అలాగే ఇందులో జిపిఎస్, లొకేషన్ ట్రాకర్లు కూడా అమర్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బూట్లను వైర్లెస్ పద్ధతిలో చార్జింగ్ చేసేలా కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వివేక్ ( Vivek Chaudhary) తాజాగా ప్రకటన చేశారు.

Next Story