- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విండ్‌ఫాల్ ట్యాక్స్ తక్షణం తీసుకున్న నిర్ణయం కాదు: Nirmala Sitharaman!
ముంబై: పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తక్షణం తీసుకున్న నిర్ణయం కాదని..Latest Telugu News

ముంబై: పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తక్షణం తీసుకున్న నిర్ణయం కాదని, పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఎలారా కేపిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్, విండ్‌ఫాల్ ట్యాక్స్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందనే వాదన సరైంది కాదని, ఈ పన్ను కు సంబంధించి పరిశ్రమలతో మాట్లాడిన తర్వాతే అమలు చేశామని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రతి పదిహేను రోజులకొకసారి పన్ను రేట్లను సమీక్షించాలనే అంశం కూడా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సూచన అని ఆమె వివరించారు. దానికి అనుగుణంగానే సవరిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి కేంద్రం చమురు సంస్థలకు అనూహ్యంగా వచ్చే లాభాలపై విండ్‌ఫాల్ ట్యాక్స్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా దేశీయ చమురు సంస్థలు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాలపై పన్ను అమలైంది.
గత వారం జరిగిన సమీక్షలో వీటి ఎగుమతులపై పన్ను రేట్లను ప్రభుత్వం పెంచింది. కొవిడ్-19 మహమ్మారి పరిణామాల తర్వాత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ప్రభుత్వానికి నిధులు సమకూరడం క్లిష్టంగా మారిందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పన్ను-జీడీపీ నిష్పత్తి 10 శాతం ఉందని, దీన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
దీని కోసం అనేక సమీక్షలు అవసరమని, మరోవైపు పెరుగుతున్న ఆదాయ పన్ను చెల్లింపులు కొంత ఊరట కలిగిస్తున్నాయన్నారు. ఇదే సమయంలో ప్రైవేటీకరణకు సంబంధించి బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని, వచ్చే పాతికేళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు సంస్కరణలు చేపడుతున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు.






