- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Exports: ట్రంప్ సుంకాల ప్రభావం ఏయే రంగాలపై ఎంతంటే..!
ట్రంప్ భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని ముద్ర వేస్తున్నప్పటికీ, గత కొన్నేళ్లలో మనదేశం సుంకాలను క్రమంగా సడలించింది

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం సుంకాల భారం 50 శాతానికి పెరిగింది. ఓవైపు ట్రంప్ భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని ముద్ర వేస్తున్నప్పటికీ, గత కొన్నేళ్లలో మనదేశం సుంకాలను క్రమంగా సడలించిందని, ముఖ్యంగా అమెరికాకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుందని డేటా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా తాజా చర్యల కారణంగా శ్రమతో కూడిన మన పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అనేక వ్యాపారాలు విదేశాలలో ప్రత్యామ్నాయాల కోసం అన్వేధించేందుకు ప్రేరేపించనుంది. ఈ టారిఫ్ ప్రభావం ఏయే రంగాలపై, ఎంతమేర ఉంటుందనే వివరాలు చూద్దాం..!
టెక్స్‌టైల్స్, ఫ్యాషన్:
అమెరికాకు జరిగే వార్షిక ఎగుమతులు: 10.3 బిలియన్ డాలర్లు(రూ. 90 వేల కోట్లు)
సుంకం రేటు: అల్లిన దుస్తులకు 63.9 శాతం, నేత వస్త్రాలకు 60.3 శాతం, తయారైన వాటిపై 59 శాతం
ఆటో విడిభాగాల పరిశ్రమ:
వార్షిక ఎగుమతులు: 7 బిలియన్ డాలర్ల (రూ. 61,211 కోట్లు)
సుంకం రేటు: 50 శాతం
రత్నాభరణాలు:
వార్షిక ఎగుమతులు: 10 బిలియన్ డాలర్లు(రూ. 87.42 వేల కోట్లు)
సుంకం రేటు: వజ్రాలు, బంగారం, సంబంధిత ఉత్పత్తులకు 52.1 శాతం
రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు:
వార్షిక ఎగుమతులు: 7.38 బిలియన్ డాలర్లు(రూ. 64.55 వేల కోట్లు)
సుంకం రేటు: 33.26 శాతం (ఇప్పటికే ఉన్న యాంటీ-డంపింగ్, కౌంటర్‌వెయిలింగ్ సుంకాలతో సహా)
లెదర్, పాదరక్షలు:
వార్షిక ఎగుమతులు: 5.7 బిలియన్ డాలర్లు(రూ. 49.86 వేల కోట్లు)
సుంకం రేటు: 60 శాతం
రసాయనాలు మరియు ఔషధాలు:
వార్షిక ఎగుమతులు: 2.7 బిలియన్ డాలర్లు(రూ. 23.62 వేల కోట్లు)
సుంకం రేటు: 54 శాతం
యంత్రాలు, ఉపకరణాలు:
వార్షిక ఎగుమతులు: 7.7 బిలియన్ డాలర్లు(రూ. 67.4 వేల కోట్లు)
సుంకం రేటు: 51.3 శాతం
ఫర్నిచర్, పరుపులు:
వార్షిక ఎగుమతులు : 1.07 బిలియన్ డాలర్లు( రూ. 9,363 కోట్లు)
సుంకం రేటు: 52.3 శాతం
ఇంజనీరింగ్ వస్తువులు:
వార్షిక ఎగుమతులు: 1.8 బిలియన్ డాలర్లు(రూ. 15.75 వేల కోట్లు). ప్రత్యక్షంగా ప్రభావితం కాకపోయినా, పరోక్షంగా ఎదుర్కొనే అవకాశం ఉంది.






