White Collar Workforce: ఈ ఏడాది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాలు సగటున 11 శాతం పెరగొచ్చు

by S Gopi |

కొన్ని సంస్థలు లాభాల మార్జిన్ ఆధారంగా సగటున 11-12 శాతం మేర పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

White Collar Workforce: ఈ ఏడాది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాలు సగటున 11 శాతం పెరగొచ్చు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయంగా వివిధ సంస్థల్లో పనిచేసే వైట్‌కాలర్ ఉద్యోగుల జీతాలు 8-11 శాతం పెరగవచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. మార్జిన్ ఒత్తిడికి తోడు ఉద్యోగ నియామకాల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, కొత్త సాంకేతికత వల్ల నియామకాల్లో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో ఈ స్థాయి వేతన పెరుగుదల ఊరటనిచ్చే అంశం. కొన్ని సంస్థలు లాభాల మార్జిన్ ఆధారంగా సగటున 11-12 శాతం మేర పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రముఖ స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో సహ-వ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ అన్నారు. ముఖ్యంగా టెక్ హెచ్-1బీ వీసాతో పాటు ఏఐ వినియోగం కారణంగా టెక్ రంగం మార్జిన్ ఒత్తిళ్లను, ఇతర సవాళ్లను ఎదుర్కొంటోంది. గత రెండేళ్ల కాలంలో టెక్ రంగంలో స్కిల్ డిమాండ్ 1.1 లక్షల మార్కును దాటేసింది. ఈ సంఖ్య పరిశ్రమలో ఎదురవుతున్న ఎదురుగాలిని సూచిస్తుందని అనిల్ వివరించారు. ఈ ఏడాది పనితీరు నెమ్మదించిన సంస్థల్లో జీతాల పెరుగుదల సగటున 5-7 శాతం ఉండవచ్చని, స్కిల్స్ అవసరమైన విభాగాల్లో 10-15 శాతం ఉంటుందని ప్రముఖ హెచ్ఆర్ కంపెనీ ఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. ముఖ్యంగా పనితీరు సంబంధిత రివార్డులు కూడా పెరుగుతున్న ధోరణిని తాము గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Next Story