Job Market: జనవరిలో 4 శాతం పెరిగిన వైట్‌కాలర్ నియామకాలు

by S Gopi |

ఇందుకు ప్రధాన ఎఫ్ఎంసీజీ సహా ఇతర సాంప్రదాయ రంగాల్లో హైరింగ్ ప్రక్రియ పుంజుకోవడం దోహదపడ్డాయి.

Job Market: జనవరిలో 4 శాతం పెరిగిన వైట్‌కాలర్ నియామకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా నియామకాల గురించి సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరిలో దేశీయంగా వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాల్లో 4 శాతం వృద్ధి నమోదైందని సోమవారం ప్రముఖ జాబ్ ప్లాట్‌ఫామ్ నౌక్రి వెల్లడించింది. ఇందుకు ప్రధాన ఎఫ్ఎంసీజీ సహా ఇతర సాంప్రదాయ రంగాల్లో హైరింగ్ ప్రక్రియ పుంజుకోవడం దోహదపడ్డాయి. గతేడాది మొత్తం నియామకాలకు సంబంధించి నిరాశజనకంగా ఉన్నప్పటికీ, 2025 సానుకూలంగా ప్రారంభమైంది. ఐటీ రంగంలో రికవరీకి తోడు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఇన్సూరెన్స్, ఆతిథ్య వంటి ప్రధాన రంగాల్లో నియామక ప్రక్రియ పెరిగింది. ఇందులోనూ వైట్ కాలర్ ఉద్యోగాలు గణనీయంగా పుంజుకోవడం మొత్తం జాబ్ మార్కెట్‌కు శుభపరిణామమని నౌక్రి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ చెప్పారు. నౌక్రి నివేదిక ప్రకారం.. ఎఫ్ఎంసీజీ రంగంలో నియామకాలు 16 శాతం, ఇన్సూరెన్స్ 15 శాతం, ఫార్మా 11 శాతం ఉద్యోగాలు పెరిగాయి. కొన్ని నెలలుగా లేఆఫ్స్ మాత్రమే జరుగుతున్న ఐటీ రంగంలో నియామకాలు ఫ్లాట్‌గా ఉండటం సానుకూల పరిణామమని పేర్కొంది. ఏవియేషన, ఏరోస్పేస్ పరిశ్రమల్లోనూ నియామకాలు గతేడాది కంటే 33 శాతం పెరగడం గమనార్హం. చాలా రంగాల్లో 4-7 ఏళ్ల అనుభవం ఉన్న వారి నియామకాలు 22 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.

Next Story