ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ బంద్

by Naga Rani Yarlagadda |

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల భద్రత, కొత్త ఫీచర్ల అనుగుణ్యతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేస్తూ ఉంటుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల భద్రత, కొత్త ఫీచర్ల అనుగుణ్యతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా.. సెప్టెంబర్ 8వ తేదీ నుండి పాత ఆండ్రాయిడ్ వెర్షన్లపై పనిచేసే ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభావితమయ్యే వెర్షన్లు ఇవే..

వాబీటా ఇన్ఫో (Wabetainfo) నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ 5.0 (Android 5.0) లేదా అంతకంటే పాత వెర్షన్లపై నడిచే ఫోన్లలో వాట్సప్ ఇకపై పనిచేయదు. అంటే ఆండ్రాయిడ్ 5.0, 5.1 వెర్షన్ల యూజర్లు ఈ ప్రభావానికి గురవుతారు. సెప్టెంబర్ 8 నుండి కేవలం ఆండ్రాయిడ్ 6.0 (Android 6.0) లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే వాట్సప్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మార్పు వల్ల ప్రభావితమయ్యే యూజర్లకు వాట్సప్ ఇప్పటికే నోటిఫికేషన్లు పంపిస్తోంది. మీ చాట్ హిస్టరీ కోల్పోకుండా ఉండాలంటే, వెంటనే గూగుల్ డ్రైవ్‌లో లేదా ఇతర డివైజ్‌లలో బ్యాక్‌అప్ తీసుకోవాలని సూచిస్తోంది. కేవలం సాధారణ వాట్సప్ మెసెంజర్ మాత్రమే కాకుండా, వాట్సప్ బిజినెస్ (WhatsApp Business) సేవలు కూడా పాత వెర్షన్లలో నిలిచిపోనున్నాయి.

ఈ మార్పు ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించింది. ఐఓఎస్ (iOS) వినియోగదారుల విషయానికొస్తే, iOS 15.1 లేదా ఆపై వెర్షన్లలో వాట్సప్ యథావిధిగా పనిచేస్తుంది. పాతతరం స్మార్ట్‌ఫోన్లలో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు, కొత్త రకం అప్‌డేట్‌లను అందించడం సాంకేతికంగా కష్టతరమవుతున్నందున వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. పాత ఫోన్లు వాడుతున్న వారు తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం లేదా కొత్త వెర్షన్ ఫోన్లకు మారడం ఉత్తమం.

Next Story