- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Whatsapp: యూజర్ల కోసం ప్రీమియం ప్లాన్ తీసుకొచ్చే పనిలో వాట్సాప్
ప్రీమియం ప్లాన్ ద్వారా కంపెనీ యూజర్లకు కస్టమైజేషన్, కొత్త ఫీచర్లను అందించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల తరహాలో వాట్సాప్‌లోనూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని అందించాలని భావిస్తోంది. ప్రీమియం ప్లాన్ ద్వారా కంపెనీ యూజర్లకు కస్టమైజేషన్, కొత్త ఫీచర్లను అందించనుంది. వాట్సాప్ ప్లస్ పేరుతో తీసుకురాబోయే ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా యూజర్లు అదనపు ఫీచర్లు పొందుతారని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే స్టేటస్ విభాగంలో యాడ్స్ ద్వార ఆదాయం ఆర్జిస్తున్న వాట్సాప్, ప్రీమియం సేవల నుంచి కూడా ఆదాయాన్ని పొందాలని ఆశిస్తోంది. కేవలం మేసేజ్‌ల కోసం యాప్‌ను వాడే యూజర్లకు ప్రస్తుతం ఉన్న తరహాలే వాట్సాప్ సేవలు ఉంటాయి. వాట్సాప్ ప్లస్ కోసం చెల్లించి ప్రీమియం ప్లాన్ తీసుకునే యూజర్లు.. యాప్ థీమ్‌ను, యాప్ ఐకాన్‌ను మార్చుకోవచ్చు. ఇందులోనూ 14 రకాల ఐకాన్ స్టైల్స్ ఇవ్వాలని వాట్సాప్ భావిస్తోంది. అలాగే, ప్రస్తుతం మూడు వరకు మాత్రమే వాట్సాప్ చాట్‌లను పిన్ చేసుకునే సదుపాయాన్ని ప్రీమియం సేవల్లో 20కి పెంచనుంది. యాప్ నోటిఫికేషన్, రింగ్‌టోన్ కూడా సెట్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రీమియం సేవల్లో మెసేజ్‌లకు ఇచ్చే రియాక్షన్లు కూడా కొత్తగా అందుబాటులో వస్తాయని తెలిపింది. అయితే, ఈ సేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. కొత్త ప్లాన్ ప్రారంభించే సమయంలో ధరలు, ఇతర ఫీచర్లు వెల్లడించవచ్చు.






