Gold Prices(23-02-2026): మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-23 05:08:00  IST  )

ఇవాళ(సోమవారం) ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,350గా ఉంది.

Gold Prices(23-02-2026): మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇక పెళ్లి అనగానే మొదటగా గుర్తొచ్చేది బంగారమే. ఇక గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు పెళ్లిళ్ల సీజన్‌లో అయిన తగ్గుముఖం పడతాయేమో అనుకున్నారు. కానీ బంగారం, వెండి ధరలు ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో నేడు(ఫిబ్రవరి 23) బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ(సోమవారం) ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న(ఆదివారం) రూ.1,59,280 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.2,070 పెరిగి రూ.1,61,350గా ఉంది. అలాగే నిన్న రూ.1,46,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,900 పెరిగి 1,47,900గా ఉంది. ఇక ఇవాళ కిలో వెండి ధర రూ.10,000 పెరిగి 3,00,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

Next Story