Mule Accounts: మ్యూల్ అకౌంట్ల ఏరివేతకు ఆర్‌బీఐ చర్యలు

by S Gopi |
Mule Accounts: మ్యూల్ అకౌంట్ల ఏరివేతకు ఆర్‌బీఐ చర్యలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న సైబర్ మోసగాళ్లపై కఠినంగా వ్యవహరించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. దీనికోసం ఆర్‌బీఐ ఇన్నోవేషన్ యూనిట్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌బీఐహెచ్) మ్యూల్‌హంటర్ డాట్ ఏఐ ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయనున్నట్టు శక్తికాంత దాస్ చెప్పారు. మ్యూల్ ఖాతాలను గుర్తించడం, వాటి ప్రభావం తగ్గించేందుకు ఈ సాంకేతికత ప్రత్యేకంగా పనిచేస్తుంది. దీనికోసం బ్యాంకులు కూడా కలిసి రావాలని ఆర్‌బీఐ బ్యాంకులను సూచించింది. సైబర్ ఫ్రాడ్ చేసే మోసగాళ్లు అమాయకుల నుంచి దోచుకున్న డబ్బును దాచుకునే అకౌంట్లను మ్యూల్ అకౌంట్లు అంటారు. ఇప్పటికే ఇలాంటి మోసాలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీన్ని మరింత విస్తృతం చేసేందుకు మ్యూల్‌హంటర్ డాట్ ఏఐ మోడల్ పనిచేస్తుందని దాస్ వివరించారు. తొలుత రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆ తర్వాత ఫలితాలను బట్టి మ్యూల్ అకౌంట్లను కట్టడి చేసేందుకు ఇతర బ్యాంకులను చేర్చుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed