- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Scam Alert: కాల్ మర్జింగ్ స్కాం అంటే ఏంటి..? ఈ ఒక్క తప్పు చేస్తే చాలు మీ అకౌంట్లో డబ్బులు అన్ని క్షణాల్లో సున్నా..
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ మోసగాళ్లు రోజుకు ఒక టెక్నిక్ ఉపయోగించి డబ్బులు కొట్టేయడానికి తెగబడుతున్నారు.

Scam Alert: దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ మోసగాళ్లు రోజుకు ఒక టెక్నిక్ ఉపయోగించి డబ్బులు కొట్టేయడానికి తెగబడుతున్నారు. వారు ఏ మాత్రం కూడా చిన్న అవకాశం లభించిన మీ అకౌంట్లో డబ్బులను గద్దల్లా తన్నుకుపోవడం ఖాయం. అలాంటి ఒక స్కాం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దాని పేరే కాల్ మర్జింగ్ స్కాం. ఈ స్కామ్ ద్వారా అమాయకులను ఎరగా చేసుకొని డబ్బులు కొట్టేస్తుంటారు. ఇది ఒక కొత్త తరహా హైటెక్ స్కాం. దీని గురించి ఇక్కడ పేర్కొన్న వీడియోలో చాలా వివరంగా చూపించారు.
అసలు ఈ కాల్ మేర్జింగ్ స్కాం ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు ఎవరైతే స్కాన్ చేదల్చుకున్నాడో అతను మీకు తెలిసిన వ్యక్తిలాగా ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ తర్వాత మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందని, లేదా మీకు ఎవరో అధికారి ఫోన్ చేస్తున్నారని, లేకుంటే మీ కుటుంబ సభ్యులు ఎమర్జెన్సీ లో ఉండి మీకు కాల్ చేస్తున్నారని వెంటనే మీరు కాల్ మాట్లాడుతున్న సమయంలోనే వస్తున్న కాల్ ను కాన్ఫరెన్స్ కాల్ రూపంలో మర్జ్ చేయమని మిమ్మల్ని కోరుతాడు. మీరు కాల్ మర్జ్ చేయగానే అవతలి వైపు నుంచి మీ బ్యాంకర్ ఓటిపి చెప్పే అవకాశం ఉంటుంది. ఈ ఓటీపిని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా విన్న స్కామర్ మీ అకౌంట్ లో డబ్బుంతా లాగేస్తాడు. ఇక్కడ జరిగిన మోసం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
అతను మీ పేరిట ఒక ఆన్లైన్ లావాదేవీ జరుపుతూ మీ నెంబర్ కు ఫోన్ కాల్ ద్వారా ఓటిపి వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత మీకు ఫోన్ కాల్ ద్వారా ఓటిపి వస్తుంది ఆ కాల్ ను మీరు కాన్ఫరెన్స్ కాల్ లో మార్జ్ చేసినట్లయితే, అవతల వైపు ఉన్న స్కామర్ ఆ ఓటీపీని విని మీ అకౌంట్లో డబ్బులు కాజేస్తాడు.
ఈ స్కామ్ నుంచి బయటపడాలంటే ముందుగా మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను ఎవరికి చెప్పకూడదు, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. Report చేయాలంటే 1930 – నేషనల్ సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయవచ్చు. పూర్తి వివరాల కోసం cybercrime.gov.in సంప్రదించండి.






