LPG GAS PRICE TODAY(January 24): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

ఈ ఏడాదిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.111 పెంచాయి.

LPG GAS PRICE TODAY(January 24): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఇదిలా ఉంటే.. నూతన సంవత్సరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1691.50కి చేరుకుంది.

అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. ఈ తరుణంలో ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కన్నా కూడా వరంగల్, హైదరాబాద్‌లోనే గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఇవాళ(జనవరి 24) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్: రూ.905

వరంగల్: రూ. 924

విశాఖపట్నం: రూ. 861

విజయవాడ: రూ.877.50

గుంటూరు: రూ. 877.50

Next Story