- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Warner Bro's: పారామౌంట్ బిడ్‌ను తిరస్కరించిన వార్నర్ బ్రదర్స్
కానీ వార్నర్ బ్రదర్స్ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆఫర్‌ను వద్దని నిర్ణయించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మరోసారి పారామౌంట్ స్కైడాన్స్ నుంచి టేకోవర్ బిడ్‌ను తిరస్కరించింది. పారామౌంట్ ఇటీవల మొత్తం కంపెనీని 108.4 బిలియన్ డాలర్ల(సుమారురూ. 9.74 లక్షల కోట్లు)కు కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. కానీ వార్నర్ బ్రదర్స్ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆఫర్‌ను వద్దని నిర్ణయించింది. ఈ ఆఫర్‌ను లివరేజ్డ్ బైఅవుట్‌గా వారు అభివర్ణించారు. అంటే ఈ ఒప్పందానికి ఆర్థిక సహాయం చేయడానికి పారామౌంట్ భారీ మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకోవాలని ప్రణాళిక వేసిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం వాటాదారులకు రాసిన లేఖలో వార్నర్ బ్రదర్స్ బోర్డు.. పారామౌంట్ ఆఫర్ అసాధారణమైన లోన్ ఫైనాన్సింగ్ కింద ఉందని, ఇది సంస్థ మూసివేతకు కారణం కావొచ్చని పేర్కొంది. గత నెలలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్ కోసం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 72 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.5 లక్షల కోట్లు). అయితే, ఈ వ్యవహారంలోకి హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ ప్రవేశించి, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కోసం బిడ్‌ను దాఖలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా వార్నర్ బ్రదర్స్ బోర్డు పారామౌంట్ బిడ్‌ను తిరస్కరించింది.






