- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Warner Bros: రెండుగా విడిపోనున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
చాలామంది వీక్షకులు సాంప్రదాయ టీవీని చూడటం మానేసి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు మారిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇకపై కంపెనీ రెండు వేర్వేరుగా వ్యాపారాలుగా విడిపోనున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీక్షకులు సాంప్రదాయ టీవీని చూడటం మానేసి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు మారిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. విడిపోయిన తర్వాత ఒక కంపెనీ స్ట్రీమింగ్, ఫిల్మ్ స్టూడియోలను నిర్వహించనుంది, మరొకటి సీఎన్ఎన్, టీఎన్‌టీ వంటి పాత కేబుల్ టీవీ ఛానెళ్ల కార్యకలాపాలను చూసుకోనుంది. ఈ మార్పుతో మీడియా రంగంలోని ఇతర కంపెనీలు సైతం మారుతున్న ధోరణికి అనుగుణంగా సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ బాధ్యతలు చేపడుతున్న సీఈఓ డేవిడ్ జాస్లావ్ స్ట్రీమింగ్, ఫిల్మ్ స్టూడియోలకు సంబంధించిన కొత్త కంపెనీ చేపడతారు. కేబుల్ ఛానెల్‌లను కలిగి ఉన్న మరొక కంపెనీని ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గున్నార్ వీడెన్‌ఫెల్స్ నిర్వహిస్తారు. ఈ నిర్ణయం ద్వారా వ్యాపారంలోని రెండు భాగాలపై దృష్టి సారిస్తూ, వేగంగా మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా రాణించేందుకు వీలవుతుందని జాస్లావ్ పేర్కొన్నారు.






