జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వడి! ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తెలుసుకోండి!

by Yella Dhawani Reddy |

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్.

జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వడి! ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సేవలు మరింత సులభతరం అయ్యాయి. ఖాతాదారులు ఇకపై తమ అకౌంట్ సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ప్రతిసారీ కార్యాలయాన్ని లేదా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించవలసిన అవసరం లేదు. జస్ట్ మిస్డ్‌ కాల్‌ ఇచ్చి లేదా SMS పంపించి బ్యాలన్స్‌, తదితర సేవలను పొందవచ్చు. ఈ సేవలు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ సేవలను వినియోగించుకోవాలంటే, ముందుగా ఖాతాదారుడి పీఎఫ్‌ ఖాతా యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (UAN) యాక్టివ్‌గా ఉండాలి. అలాగే, ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో యూఏఎన్‌ నంబరుతో ఖాతాదారు మొబైల్‌ నంబరు తప్పనిసరిగా నమోదై ఉండాలి.

ఇక మిస్డ్‌ కాల్‌ సేవను పొందాలంటే.. 9966044425 ఫోన్‌ నంబరుకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి. రెండుసార్లు రింగ్‌ అయిన తర్వాత కాల్‌ డిస్కనెక్ట్‌ అవుతుంది. తర్వాత ఫోన్‌కు టెక్స్‌ మెసేజ్‌ వస్తుంది. తాజా ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌, ప్రస్తుత పీఎఫ్‌ బ్యాలన్స్‌ వివరాలు ఈ మెసేజ్‌లో ఉంటాయి. ఎస్‌ఎంఎస్‌ సేవల కోసం రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి EPFOHO UAN అని టైప్‌ చేసి 7738299899 ఫోన్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. తాజా పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌, ప్రస్తుత పీఎఫ్‌ బ్యాలన్స్‌ వివరాలతో సమాధానం వస్తుంది. ఈ సేవలను ప్రాంతీయ భాషల్లో కూడా పొందవచ్చు.

Next Story