Retirement planning: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష పెన్షన్ కావాలా? అయితే ఇలా చేయండి..!!

by Vennela |

Retirement planning: రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి చాలా మందిలో బెంగ ఉంటుంది.

Retirement planning: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష పెన్షన్ కావాలా? అయితే ఇలా  చేయండి..!!
X

దిశ, వెబ్ డెస్క్: Retirement planning: రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి చాలా మందిలో బెంగ ఉంటుంది. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగానే రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ. లక్ష పెన్షన్ పొందవచ్చు. కానీ కొన్ని టెక్నిక్స్ పాటిస్తే నెలకు ఈజీగా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. 40ఏళ్లకు రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు.

ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడం అంటే ఉద్యోగం నుంచి విరమణ పొందడం అని అర్థం. ఇదే కాదు ఆర్థిక స్వేచ్ఛను కూడా సాధించడం. అంటే మీ జీవిత కాల ఖర్చుల కోసం పనిచేయడానికి బదులుగా అవసరమైన డబ్బును ముందుగానే ఆదా చేసుకోవడం. ఇది సాధించడం అంత సులభం కాదు. కానీ ప్రణాళిక ఉంటే 40ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ప్లాన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఎప్పుడు ప్రారంభించాలి..ఎలా ప్రారంభించాలి..నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ సమయంలో డబ్బు ఎంత అవసరం.. ఆ లక్ష్యాన్ని ఎంత కాలంలో చేరుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మీ భవిష్యత్ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

ఉదాహరణ చెప్పాలంటే 25ఏళ్ల వ్యక్తి నెలలవారీ ఖర్చులు రూ. 30వేలు అనుకుందాం. ద్రవ్యోల్బణం ఏడాదికి 6శాతం ఉంటే 15ఏళ్లలో అదే ఖర్చు రూ.1,00,000అవుతుంది. అందుకే లక్ష పెన్షన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే నెలకు రూ. 20,000 పెట్టుబడి పెట్టి, ప్రతి ఏడాది 5శాతం పెంచుకుంటూ ఏడాదికి 14శాతం రాబడి వస్తే 40ఏళ్లకు ఆ వ్యక్తి దగ్గర రూ. 2.04 కోట్లు ఉంటాయి. రూ.2.04కోట్ల మొత్తాన్ని ఒకేలా రాబడి ఇచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే నెలకు ఈజీగా రూ. 1,00, 000 ఆదాయం వస్తుంది. అందుకే తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మేలు. 7శాతం రాబడి ఇచ్చే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ తక్కువ రిస్క్ ఉంటాయి. ఇవి భవిష్యత్ ఖర్చులను ఎదుర్కొనేందుకు ఒక స్థిరమైన మార్గాన్ని కల్పిస్తుంది.

ఈ నెలవారి ఆదాయ పథకంలో 30ఏళ్లు రూ. 1,00,000 నెలకు పొందవచ్చు. ఆ తర్వాత ఆ నిధిలో రూ. 9.82 కోట్ల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. ఇది మీ కుటుంబానికి భద్రమైన ఆర్థిక వనరుగా ఉంటుంది.ఈ లెక్కలు కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. రిటైర్మెంట్ ప్లాన్ తీసుకునే ముందుకు ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

Next Story